బుధవారం 20 జనవరి 2021
Khammam - Nov 27, 2020 , 02:32:52

సకాలంలో పనులు పూర్తి కావాలి

సకాలంలో పనులు పూర్తి కావాలి

  • ఖమ్మం కలెక్టర్‌   ఆర్వీ కర్ణన్‌

ఖమ్మం: ఖమ్మం నగరంలో వచ్చే నెల 2 న ప్రారంభోత్సవానికి సిద్ధం కావాల్సిన పనులన్నింటినీ సత్వరం పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదేశించారు. గురువారం ఆయన నగరంలోని పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయ నూతన భవనం, ముస్తాఫానగర్‌ జంక్షన్‌, ధంసలాపురం రైల్వే వర్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్‌ కమిషనరేట్‌ నూతన భవన పనులు పూర్తయ్యాయని, గ్రీనరీ, ఫౌంటెన్‌ పనులు పూర్తి కానున్నాయని అదనపు డీసీపీ మురళీధర్‌రావు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ప్రారంభానికి ముస్తాబైన ధంసలాపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని సందర్శించారు.బ్రిడ్జి పనులు, జంక్షన్‌ పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయని, బ్రిడ్జిపై ట్రాక్‌వే పెయింటింగ్‌, సూచికల బోర్డు, ప్రవేశ మార్గం ఆర్చ్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. సుందరయ్య నగర్‌ వద్ద గోళ్లపాడ్‌ ఛానల్‌ ఆధునీకరణ పనులను చేపడుతున్న అధికారులకు సూచనలు సలహాలిచ్చారు. ఇరువైపులా ఫెన్సింగ్‌, గ్రీనరీ, ఓపెన్‌ జిమ్‌ పార్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ ఈఈ శ్యాంప్రసాద్‌, నగర పాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులు, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ  రంజిత్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.logo