గురువారం 28 జనవరి 2021
Khammam - Nov 24, 2020 , 00:17:22

గ్రానైట్‌ వ్యాపారి హత్య

గ్రానైట్‌ వ్యాపారి హత్య

ఖమ్మం సిటీ: ఖమ్మం ఎన్నెస్పీ ప్రాంతానికి చెందిన ప్రముఖ గ్రానైట్‌ వ్యాపారి వెనిశెట్టి రంగనాథ్‌(42) సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్‌ గ్రామ శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ర్టానికి చెందిన రంగనాథ్‌ కొన్నేళ్ల క్రితం ఖమ్మం వలస వచ్చి గ్రానైట్‌ కంపెనీలో పనిచేశాడు. ఈ రంగంలో సాధించిన అనుభవంతో సొంతంగా వ్యాపారం చేయసాగాడు. ఖమ్మం రూరల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో క్వారీలు నడుపుతున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ..

కొందరితో కలిసి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్‌ గ్రామ ప్రాంతానికి వచ్చిన ఆ యన సోమవారం ఉదయం అనుమానాస్పదంగా మృతిచెందారు. స్థానికు లు ఇచ్చిన సమాచారంతో అక్కడకు పోలీసులు వెళారు. లభించిన ఆధారాలతో అతడిని రంగనాథ్‌గా గుర్తించారు. శవ పరిశీలన అనంతరం హత్యగా నిర్ధారించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రంగనాథ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.logo