శనివారం 05 డిసెంబర్ 2020
Khammam - Nov 23, 2020 , 01:09:11

410 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

 410 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

తల్లాడ: రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న 410 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వైరా ఏసీపీ సత్యనారాయణ తెలిపిన వివరా లు... వైరా సీఐ వసంతకుమార్‌, తల్లాడ ఎస్సై తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు లు మండలంలోని రెడ్డిగూ డెం వద్ద ఆదివారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు లారీల ను తనిఖీ చేశారు. వాటి నుంచి మొత్తం 420 క్విం టాళ్ల రేషన్‌ బయ్యం బస్తాలను స్వాధీనపర్చుకున్నారు. వీటి విలువ రూ.10.66 లక్షలు ఉం టుంది. లారీ డ్రైవర్లు బిట్రా పుల్లారావు, తోట రవికుమా ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసును ఎస్సై తిరుపతిరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.

  • పెద్దతండాలో 100 క్వింటాళ్లు

ఖమ్మం రూరల్‌: అక్ర మంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని ఖమ్మం రూరల్‌ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. మండలంలోని పెద్దతండా  గ్రామానికి చెందిన బాణోతు గణేశ్‌(35) ఆటోలో అక్రమంగా తరలిస్తున్న ఈ బియ్యాన్ని పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. కేసును ఎస్సై బాణాల రాము దర్యాప్తు చేస్తున్నారు.