శుక్రవారం 04 డిసెంబర్ 2020
Khammam - Nov 21, 2020 , 01:26:33

ద్విచక్ర వాహనం ధ్వంసం

ద్విచక్ర వాహనం ధ్వంసం

ఖమ్మం సిటీ : ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ద్వారకానగర్‌కు చెందిన ముద్దంగల్‌ నవీన్‌, నరేశ్‌ అన్నదమ్ములు. ఈ నెల 16న రేవతీ సెంటర్‌కు వెళ్లి ఖలీల్‌ అనే వ్యక్తితో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన కొందరు వీరిని వెంబడించగా ద్విచక్ర వాహనం వదిలేసి పారిపోయారు. దీంతో అల్లావుద్దీన్‌, శ్రీను అనే ఇద్దరు వాహనాన్ని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఈ విషయంపై బాధితుల తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.