గురువారం 28 జనవరి 2021
Khammam - Nov 20, 2020 , 04:52:17

‘ఖానాపురం ట్యాంక్‌ బండ్‌' మరో మణిహారం

‘ఖానాపురం ట్యాంక్‌ బండ్‌' మరో మణిహారం

  •  పనులను పరిశీలించిన మంత్రి అజయ్‌

రఘునాథపాలెం : ఖమ్మం నగర ప్రజలకు ఖానాపురం మినీ ట్యాంక్‌ బండ్‌ మరో మణిహారమని రాష్ట్ర రవాణాశాఖా మాత్యులు పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ఖానాపురం ఊరచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి పర్యవేక్షించారు. ఖానాపురం ఊరచెరువును ఖమ్మం మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి ఖమ్మం ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అధికారులకు పలు సూచనలు చేశారు. ఫ్లోటింగ్‌ ఫౌంటేన్‌తో పాటు వాకింగ్‌ ట్రాక్‌, చుట్టూ పాం ట్రీస్‌, ఓపెన్‌ జిమ్‌, పిల్లలకు ఆహ్లాదం కోసం ఆట వస్తువులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మినీ ట్యాంక్‌బండ్‌ను పూర్తిగా అన్ని హంగులతో ముస్తాబు చేసి త్వరలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ఖమ్మం నగరపాలక కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, ఆత్కూరి హనుమాన్‌, టీఆర్‌ఎస్‌ 5వ డివిజన్‌ అధ్యక్షుడు తాతా ప్రసాద్‌, మందా ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo