గురువారం 28 జనవరి 2021
Khammam - Nov 16, 2020 , 02:18:18

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

  • ఎమ్మెల్సీలుగా రజక, ఆర్యవైశ్యలకు సముచిత స్థానం కల్పించినందుకు కృతజ్ఞత

వైరా/ మయూరిసెంటర్‌: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా రజక, ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలని నిర్ణయించినందుకు కృతజ్ఞతగా ఆయా సంఘాల నాయకులు ఖమ్మం జిల్లాలో ఆదివారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రజక సంఘం రాష్ట్ర నాయకుడు బసవరాజు సారయ్యను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతగా ఆ సంఘం నాయకులు వైరాలోని హరిత రెస్టారెంట్‌ ఎదురుగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మున్సిపాలిటీ కౌన్సిలర్‌ ఏదునూరి పద్మజతోపాటు రజక సంఘం నాయకులు, టీఆర్‌ఎస్‌ నాయకులు క్షీరాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఏదునూరి శ్రీను, సంగెపు వెంకన్న, ఏదునూరి చిన్న వెంకన్న, కన్నెగంటి రాము, రేమల్లె రాము, ఏదునూరి రాము, రాజు, తాళ్ళూరి నవీన్‌, మంకెన ఉపేందర్‌, ఏదునూరి నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం గాంధీచౌక్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు కూడా క్షీరాభీషేకం చేశారు.

ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు సిద్దంశెట్టి శ్రీకాంత్‌, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు డోకుపర్తి సుబ్బారావు, పెనుగొండ ఉపేందర్‌, వీవీ సుబ్బారావు మాట్లాడారు. ఆర్యవైశ్య నేత బొగ్గారపు దయానంద్‌కు శాసనమండలిలో చోటు కల్పించిన ఘనత, మరో వైపు కార్పొరేషన్ల అధ్యక్షులుగా ఆర్యవైశ్యులను నియమించడం ఘనత ఉద్యమనేత సీఎం కేసీఆర్‌కే దక్కిందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు, టీఆర్‌ఎస్‌ నాయకులు బోజెడ్ల రామ్మోహన్‌రావు, రామారావు, భిక్షమయ్య, మృత్యుంజయరావు, నరేంద్ర, రమేష్‌, అరవింద్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 


logo