ఆనందాల దీపావళి

- ఉమ్మడి జిల్లాలో సంబురంగా పండుగను జరుపుకున్న ప్రజలు
- వేడుకల్లో పాల్గొన్న మంత్రి అజయ్, ఎమ్మెల్యేలు తదితర ప్రముఖులు
దీపాలు బారులు తీరాయి.. మట్టి ప్రమిదల కాంతులు ఇంటింటా ప్రకాశించాయి.. కాకరపూలు, మతాబులు వెలుగులు నింపాయి.. తారాజువ్వల కాంతులు చీకట్లను విరజిమ్ముతూ మిన్నంటాయి.. భూచక్రాలు, విష్ణు చక్రాలు మిరుమిట్లుగొల్పగా.. థౌజండ్‌వాలాలు పిల్లలు, పెద్దలకు థ్రిల్లింగ్ ఇచ్చాయి. బాంబుల మోతలతో వీధులన్నీ సందడిగా మారాయి. ఎట్టకేలకు క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి పటాకులు పేలుళ్లతో సంబురం అంబరాన్నంటింది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సహా.. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కుటుంబ సమేతంగా దీపావళి పండుగను జరుపుకున్నారు.
-నెట్వర్క్
ఖమ్మం కల్చరల్: దీపాల వరుసలు బారులు తీరాయి. మట్టి ప్రమిదల కాంతులు ఇంటింటా ప్రకాశించాయి. కాకరపూలు, మతాబులు వెలుగులు నింపాయి.. తారాజువ్వలు కాంతులు విరజిమ్ముతూ మిన్నంటాయి. భూచక్రాలు, విష్ణు చక్రాలు మిరుమిట్లుగొలుముతూ గిర్రున తిరిగాయి. థౌజండ్‌వాలాలు కాసేపు తమ సత్తా చూపాయి. వీధులన్నీ బాంబుల మోతతో, కాంతులతో ప్రకాశించాయి. వెరసి ఆశ్వీయుజ బహుళ అమావాస్య శనివారం దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు తీసుకొచ్చింది. ఎట్టకేలకు క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి బాణాసంచా చప్పుళ్లు సంబురం అంబరాన్నంటింది. ఇతిహాస, పురాణ గాథల ప్రకారం విజయానికి సంకేతంగా ఆనందానికి ప్రతీకగా పేల్చే బాణాసంచా ఆనవాయితీ ఈ దఫా కూడా వాడవాడల్లో వెలుగులు నింపింది. మామిడితోరణాలు, రంగవల్లులతో ప్రతి ఇల్లు నూతన శోభతో ఉట్టిపడింది.
పండుగ సందర్భంగా భక్తులు ఆలయాలకు తరలివెళ్లి తమ తమ ఇష్ట దైవాలను దర్శించుకుని పూజలు చేశారు. ఇండ్లల్లో లక్ష్మీపూజలు చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అమావాస్య తిథి ఆదివారం కూడా ఉండటంతో భక్తులు భక్తి ప్రపత్తులతో వ్రతాలు ఆచరించారు. కరోనా నేపథ్యంలో బాణాసంచా విక్రయాలు, వినియోగంపై కొంత గందరగోళం ఏర్పడినప్పటికీ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు బాణాసంచా పేల్చడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రాకర్స్ క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్లో క్రాకర్స్ విక్రయించారు. కాగా నిరుటితో పోల్చుకుంటే ఈ దఫా బాణాసంచా వినియోగం తగ్గింది. కొవిడ్ నేపథ్యంలో వాయు కాలుష్యం, శ్వాస కోస ఇబ్బందులు దృష్ట్యా ప్రజలు వీటి వినియోగంపై కొంత నియంత్రణ పాటించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
తాజావార్తలు
- ప్రతిదానికి వ్యతిరేకత పద్ధతి కాదు: బెంగాల్ గవర్నర్
- భూ కేటాయింపు పత్రాలను అందజేసిన ప్రధాని
- విజయ్‌సాయిరెడ్డిపై దాడి కేసు.. ఏ1న్గా చంద్రబాబు!
- అప్రమత్తతోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట: మంత్రి పువ్వాడ
- మెగా బ్రదర్ ఫ్యామిలీ పిక్ అదుర్స్!
- నేతాజీ జయంతి వేడుకల్లో అమిత్‌షా
- బైడెన్ దూకుడు.. 3 రోజుల్లో 30 ఆదేశాలు
- ఇక్కడ కమలం వికసించదు: కనిమొళి
- వైరస్‌పై తప్పుడు కథనాలు.. యూట్యూబ్ ఛానెల్‌పై నిషేధం
- నేతాజీకి నివాళులర్పించిన మంత్రులు