గురువారం 28 జనవరి 2021
Khammam - Nov 04, 2020 , 01:31:06

‘చేపల’ పెంపకం.. మత్స్యకారులకు వరం

‘చేపల’ పెంపకం.. మత్స్యకారులకు వరం

రఘునాథపాలెం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెరువుల్లో చేపల పెంపకం కార్యక్రమం మత్స్యకారులకు వరంలాంటిదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. చెరువుల్లో పోసిన చేపల సంపదను అభివృద్ధి చేసుకొని ఆర్థిక పరిపుష్టిని పొందాలని మత్య్సకారులకు సూచించారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం నగరం ఖానాపురం ఊర చెరువులో 33 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’ పథకంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయన్నారు. ఏ చెరువును చూసినా జలసిరితో అలగు పోస్తూ ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఐదేళ్లుగా చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధిని సాధించాలన్నారు. ఖమ్మం జిల్లాలో 2020-21 సంవత్సరానికి గాను 936 చెరువుల్లో 345.48 లక్షల చేప పిల్లలు వదిలే లక్ష్యం ఉందన్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 659 చెరువుల్లో 242 లక్షలకు పైగా చేప పిల్లలు వదిలినట్లు వివరించారు. అనంతరం ఖానాపురం ఊర చెరువును ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్‌ పాపాలాల్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, కేఎంసీ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, ఆత్కూరి హనుమాన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తాతా ప్రసాద్‌, చిలకల వెంకటనర్సయ్య, దొంగల తిరుపతిరావు, పొదిల పాపారావు, తిప్పట్ల నర్సింహారావు, మంద ఉపేందర్‌, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.


logo