బుధవారం 02 డిసెంబర్ 2020
Khammam - Nov 01, 2020 , 01:32:12

దేశ సమగ్రతకు పాటుపడిన ‘పటేల్‌'

దేశ సమగ్రతకు పాటుపడిన ‘పటేల్‌'

  • సర్దార్‌ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవంలో సీపీ 

ఖమ్మం సిటీ/ రఘునాథపాలెం: ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్‌లో సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా శనివారం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్‌) ఘనంగా నిర్వహించారు. నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లా పోలీస్‌శాఖకు చెందిన సిటీ ఆర్మ్‌డ్‌ వేడుకలను జరుపగా.. సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. దేశ సమగ్రత కోసం పాటుపడిన సర్దార్‌ పటేల్‌ సేవలకు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ మాధవరావు, ఎస్‌బీ ఏసీపీ ప్రసన్నకుమార్‌, సీసీఆర్‌బీ ఏసీపీ ఎల్‌సీ నాయక్‌, సీటీసీ ఏసీపీ ప్రసాద్‌, సీఐలు సంపత్‌, రవీందర్‌, ఆర్‌ఐలు రవి, శ్రీనివాస్‌, తిరుతపతి, సాంబశివరావు పాల్గొన్నారు.

రఘునాథపాలెం మండలంలోని పలు పాఠశాలల్లోనూ, రఘునాథపాలెం పోలీస్‌ స్టేషన్‌లోనూ రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేశారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌, ఎంఈఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.