శుక్రవారం 04 డిసెంబర్ 2020
Khammam - Nov 01, 2020 , 01:32:12

మహా కవి వాల్మీకి మహర్షి

మహా కవి వాల్మీకి మహర్షి

  •  జయంతి ఉత్సవాల్లో కలెక్టర్‌ కర్ణన్‌

ఖమ్మం/ మయూరిసెంటర్‌: సంస్కృతంలో పద్యాలు రాసిన మొదటి కవి మహర్షి వాల్మీకి అని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పేర్కొన్నారు. మహర్షీ వాల్మీకి జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎస్‌.మధుసూదన్‌రావు, శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, డీఆర్‌వో శిరీష, జిల్లా వెనుకబడిన తరగుతుల అభివృద్ధి అధికారి జ్యోతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, డీఈవో మదన్‌మోహన్‌, సీపీవో శ్రీరాం, డీటీడబ్ల్యూవో ప్రియాంక, ఉద్యనవాన అధికారి అనసూయ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి పురందేశ్వర్‌, కలెక్టరేట్‌ ఏవో మదన్‌గోపాల్‌ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో..

ఖమ్మంలోని టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయఃలో వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ మాట్లాడారు. షకీనా, తన్నీరు శోభారాణి, జానిమియా, తోట రాజ్యలక్ష్మి, జానకీరాం, ప్రసాద్‌, లక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.

వాల్మీకి జయంతి, కుమ్రం భీం వర్ధంతి కార్యక్రమాలను వివిధ సంఘాలు, కార్యాలయాల ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖమర్‌, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ.వెంకటేశ్వర్లు, కార్పొరేటర్‌ షౌకత్‌ అలీ మాట్లాడారు.