శనివారం 05 డిసెంబర్ 2020
Khammam - Oct 27, 2020 , 04:48:22

దుర్గమ్మా..చల్లంగ చూడమ్మా ..

దుర్గమ్మా..చల్లంగ చూడమ్మా ..

దసరా పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పలుచోట్ల ప్రత్యేక పూజలు చేశారు. పాల్వంచ రూరల్‌లోని పెద్దమ్మతల్లి దేవాలయంలోని శ్రీకనకదుర్గ అమ్మవారిని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు దర్శించుకుని పూజలు చేశారు. ఖమ్మంలోని శ్రీస్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, పలువురు పూజలు నిర్వహించారు. టేకులపల్లిలోని కోయగూడెం

పెద్దమ్మతల్లికి జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టేకులపల్లి మండలం దాసుతడా గ్రామంలో ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌ దంపతులు తమ ఇంటి వద్ద గోమాతకు, దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహంచారు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించేందుకు భౌతికదూరం పాటించి ఆకట్టుకున్నారు.    - నెట్‌వర్క్‌