గురువారం 03 డిసెంబర్ 2020
Khammam - Oct 27, 2020 , 04:48:19

పట్టభద్రుల ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి

పట్టభద్రుల ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి

- ఎమ్మెల్యే రాములునాయక్‌

ఏన్కూరు : ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వైరా శాసనసభ్యుడు లావుడ్యా రాములునాయక్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం ఏన్కూరు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఏన్కూరు, జూలూరుపాడు మండలాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జులు, పార్టీ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ..గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భూక్యా లాలునాయక్‌, ఏన్కూరు, జూలూరుపాడు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు బానోత్‌ సురేశ్‌ నాయక్‌, చౌడం నర్సింహారావు, జూలురుపాడు జడ్పీటీసీ భూక్యా కళావతి, ఏన్కూరు మాజీ జడ్పీటీసీ నల్లమల వెంకటేశ్వరరావు, సోషల్‌ మీడియా కన్వీనర్‌ ఇసనపల్లి నాగేశ్వరరావు, ఏన్కూరు మండల కార్యదర్శి స్వర్ణప్రహ్లాదరావు, నాయకులు మేడా ధర్మారావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, భూక్యా చందులాల్‌, ముక్తి వెంకటేశ్వర్లు, చింతనబోయిన సీతారాములు, పూర్ణకంటి మైసారావు, రేగళ్ళ నాగయ్య, వడ్లమూడి అరవింద్‌, శేషగిరిరావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.