సోమవారం 25 జనవరి 2021
Khammam - Oct 24, 2020 , 01:32:55

వ్యవసాయ మార్కెట్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా నిర్మల

వ్యవసాయ మార్కెట్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా నిర్మల

ఖమ్మం వ్యవసాయం : వ్యవసాయ మార్కెట్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా నిర్మల శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. జిల్లాలోని ఏన్కూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సూపర్‌ వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ తాజాగా మార్కెటింగ్‌ శాఖ పదోన్నతి పొంది అసిస్టెంట్‌ సెక్రటరీగా ఖమ్మం మార్కెట్‌కు కేటాయించబడ్డారు.

ఈ నేపథ్యంలో బాధ్యతల స్వీకరణకు ముందుగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, మార్కెట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి రుద్రాక్షల మల్లేశం, గ్రేడ్‌-2 సెక్రటరీ బీ బజార్‌, అసిస్టెంట్‌ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డిలను నిర్మల మర్యాదపూర్వకంగా కలిశారు. వారి సమక్షంలో సెక్రటరీ మల్లేశానికి జాయినింగ్‌ రిపోర్ట్‌ అందజేశారు. నిర్మల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మార్కెట్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చౌటుప్పల్‌ సెక్రటరీ ఫసీయుద్దీన్‌, ఉద్యోగుల సంఘం నేతలు పీ నిర్మల, మద్దులపల్లి మార్కెటింగ్‌ కమిటీ ఇన్‌చార్జ్‌ సెక్రటరీ వీరాంజనేయులు, టీఎన్‌జీవోస్‌ నాయకులు హిమాయత్‌ హుస్సేన్‌, రామారావు, రాజా, సత్యనారాయణ, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు అధికారి నిర్మలకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. 


logo