గురువారం 28 జనవరి 2021
Khammam - Oct 24, 2020 , 01:32:55

హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ వివరాలు ఆన్‌లైన్‌ చేయండి

హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ వివరాలు ఆన్‌లైన్‌ చేయండి

- జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ బి.మాలతీ 

మయూరిసెంటర్‌ : కొవిడ్‌ నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో వ్యాక్సీన్‌ను తీసుకురానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యశాలల్లో కరోనా వారియర్స్‌గా పనిచేస్తున్న హెల్త్‌ ప్రొవైడర్స్‌కు టీకా వేసేందుకు వారి డేటాను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ బీ మాలతీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రైవేట్‌ వైద్యశాలల యాజమాన్యం, ఐఎంఏ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ వివరాలను ఆన్‌లైన్‌లో తగిన ఫార్మెట్‌లో నింపి సోమవారంలోపు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. డేటా సమీకరణ, ఆన్‌లైన్‌ విధానంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఫార్మెట్‌ నింపాలన్నారు. ఈ విధానాన్ని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ టీమ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు వైద్యులు శోభాదేవి, కూరపాటి ప్రదీప్‌కుమార్‌, ఎన్‌హెచ్‌ఎం ఎస్‌డీపీవో నీలోహన, డిప్యూటీ డెమో సాంబశివరరెడ్డి, ఏఎస్‌వో హరికృష్ణ, డీడీఎం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.


logo