బుధవారం 02 డిసెంబర్ 2020
Khammam - Oct 23, 2020 , 04:31:10

కార్మికుల పక్షపాతి నాయిని

కార్మికుల పక్షపాతి నాయిని

  • తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర
  • కేసీఆర్‌ వెంటే నడిచిన నాయిని
  • మంత్రి పువ్వాడఅజయ్‌కుమార్‌
  • టీఆర్‌ఎస్‌ కార్యాలయంలోనాయినికి ఘన నివాళులు

ఖమ్మం : కార్మిక సంఘ నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత నాయిని నర్సంహారెడ్డి మరణం అత్యంత బాధాకరమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో నాయిని చిత్రపటానికి మంత్రి పువ్వాడ నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో నాయిని నర్సింహారెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారని, అనంతరం 2001లో నాటి ఉద్యమసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వానికి ఆకర్షతులై తెలంగాణ సాధన కోసం మలి దశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు.

పార్టీలో నాయిని నర్సింహారెడ్డికి కేసీఆర్‌ అన్ని వేళలా అత్యున్నత స్థానం కల్పించి రాష్ర్టానికి తొలి హోంశాఖ మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. హోంమంత్రిగా నాయిని తెలంగాణ ప్రజల మన్ననలు పొందారని అన్నారు. మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నాయిని.. కార్మిక సంఘ నాయకుడిగా ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగినప్పటికీ నిరాడంబరంగా జీవించారని పువ్వాడ కొనియాడారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, వారి ఆత్మకుశాంతి చేకూరాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మేయర్‌ పాపాలాల్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఖమర్‌, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ, కార్పొరేటర్‌ ఊట్కూరి లక్ష్మీసుజాత, సుడా సలహా మండలి సభ్యులు దేవభక్తిని కిషోర్‌బాబు, కొల్లు పద్మ, రమేశ్‌గౌడ్‌, ఆళ్ల అంజిరెడ్డి, శేషు పాల్గొన్నారు.

సత్తుపల్లిలో ఎంపీ, ఎమ్మెల్యే నివాళి..

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి మృతితో రాష్ట్రం ఓ గొప్ప ఉద్యమకారుడిని కోల్పోయిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయిని చిత్రపటానికి నామా, సండ్రలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.