శుక్రవారం 04 డిసెంబర్ 2020
Khammam - Oct 23, 2020 , 04:31:06

ఒక్కేసి పువ్వేసి చందమామ..

ఒక్కేసి పువ్వేసి చందమామ..

  • సందడిగా వేపకాయ బతుకమ్మ

ఖమ్మం కల్చరల్‌/ సత్తుపల్లి/ కొత్తగూడెం సింగరేణి: బతుకమ్మ పాటలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా హోరెత్తింది. తీరొక్క పూలతో ఖమ్మం నగరం పూలశిఖరమైంది. పలు రకాల పూలు బతుకమ్మగా ఒదిగి పూజలందుకున్నాయి. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు వేపకాయల బతుకమ్మను ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. ఖమ్మంలోని 16వ డివిజన్‌లో  సెయిం ట్‌ మెరీస్‌ స్కూల్‌ ఎదురుగా  కార్పొరేటర్‌ కమర్తపు మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సం బురాలు అంబరాన్నంటాయి.

సుమారు 300 మం ది మహిళలు బతుకమ్మలతో తరలివచ్చి సంబురాలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన 12 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ చిన్నా, పెద్ద పలు పరిమాణాలలోని బతుకమ్మలను అమర్చి బతుకమ్మ ఆటపాటలాడి సందడి చేశారు. కొత్తగూడెం సింగరేణి హెడ్‌ ఆఫీస్‌లో అధికారులు, మహిళలు బతుకమ్మ ఆడారు. సత్తుపల్లిలోని మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.