గురువారం 03 డిసెంబర్ 2020
Khammam - Oct 22, 2020 , 02:27:19

రైతులకు అండగా ఉంటాం

రైతులకు అండగా ఉంటాం

  • అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
  • వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉండాలి
  • పంటల పరిశీలనలో ఖమ్మం ఎంపీ నామా
  • జుజ్జుల్‌రావుపేట, గోకినేపల్లిలో పర్యటన

కూసుమంచి రూరల్‌ : వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, వారికి అండగా ఉంటామని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని జుజ్జల్‌రావుపేట శివారులో దెబ్బతిన్న వరిపైర్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు వరిపైరు నేలవాలి, నీటిలో కుళ్లిపోయిందని బాధిత రైతులు ములిగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మందడి వెంకటరెడ్డి ఎంపీకి వివరించారు. పంట నష్టం వివరాలను అక్కడే ఉన్న కూసుమంచి ఏడీఏ విజయచంద్రను అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌ పరిధిలో 15,377 ఎకరాల్లో పత్తి, వరి పంట దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ, ఉద్యావన శాఖల అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ పంట లు కాపాడుకోవడానికి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్‌, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి, బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. నామా వెంట టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని స్వర్ణకుమారి, చిత్తారు శ్రీహరి, ఆత్మ చైర్మన్‌ రామసహాయం బాలకృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌రావు, నేలకొండపల్లి మార్కెట్‌ చైర్మన్‌ సేట్రాంనాయక్‌ జుజ్జల్‌రావుపేట సర్పంచ్‌ మందడి పద్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చాట్ల పరుశురాం, నాయకులు మల్లీడు వెంకటేశ్వర్లు, రషీద్‌ అహ్మద్‌, షేక్‌ అలీ, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. 

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : ఎంపీ నామా 

ముదిగొండ : అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులందరనీ ప్రభుత్వం ఆదుకుంటుదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు రైతులకు భరోసా ఇచ్చారు. మండల పరిధిలోని గోకినేపల్లి గ్రామంలో బుధవారం అకాల వర్షాలతో పంట నష్టపోయిన పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీగడ నాగేశ్వరరావు అనే రైతు వరి పూర్తిగా దెబ్బతిని నేలకొరగగా బురదలో సైతం పొలంలోకి వెళ్లి పంటను పరిశీలించారు.

పంటను విక్రయించినా ప్రయోజనం లేదని పెట్టుబడి ఖర్చులు కూడా రావని రైతు తన గోడు చెప్పుకోగా.. అధైర్య పడవద్దని పంట నష్టపోయిన రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పంటనష్టాన్ని సీఎం కేసీఆర్‌కు వివరిస్తానని రైతులెవరూ కలత చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గోకినేపల్లి ఎంపీటీసీ రాంబాబు, సర్పంచ్‌ క్రాంతి తమ గ్రామం నుంచి కట్టకూరు వెళ్లే డొంక రోడ్డు మంచిగా లేదని వినతిపత్రం ఇవ్వగా, త్వరలోనే రోడ్డు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకురాలు స్వర్ణకుమారి, జడ్పీటీసీ దుర్గ, ఎంపీపీ హరిప్రసాద్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ రాధ, ఎంపీఓ సూర్యనారాయణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మీగడ శ్రీనివాస్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వేముల శ్రీను, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎర్ర వెంకన్న, పోట్ల ప్రసాద్‌, తోట ధర్మ, మల్లయ్య, వెంకట్‌, సిల్వరాజు, రమేశ్‌, ప్రసాద్‌, శరత్‌, సీతరామయ్య, అనంతరెడ్డి, వెంకటనాగ ప్రసాద్‌, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.