గురువారం 03 డిసెంబర్ 2020
Khammam - Oct 20, 2020 , 03:11:10

వదలని వరుణుడు

వదలని వరుణుడు

సీజన్‌ ముగుస్తున్నా, నైరుతి రుతుపవనాలు వదిలి వెళ్లినా వరుణదేవుడు మాత్రం తన ప్రతాపం కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో నగరవాసుల నుంచి మొదలు కొని పల్లె ప్రజల వరకూ కొంత ఇబ్బందులకు గురువుతున్నారు. ఇటీవల వరుసుగా నాలుగు రోజులపాటు భారీగా కురిసిన వర్షం.. రెండు మూడు రోజులుగా కాస్త విరామమిచ్చింది. దీంతో ఊపరి పీల్చుకున్న నగర వాసులను సోమవారం సాయంత్రం ముద్దముద్ద చేసింది. సాయంత్రం నుంచి దట్టమైన మేఘాలు అలుముకోవడంతో అప్పుడే వర్షం పడే అవకాశం ఉందని నగర ప్రజలు భావించారు. కానీ రాత్రి 7:30 దాటాక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఖమ్మం నగరంలోని ప్రధాన వీధులు జలమయమయ్యాయి. 

 -ఖమ్మం వ్యవసాయం