బుధవారం 02 డిసెంబర్ 2020
Khammam - Oct 20, 2020 , 03:00:34

శ్రీలక్ష్మీ.. నీ మహిమలో..

శ్రీలక్ష్మీ.. నీ మహిమలో..

  • ఘనంగా బతుకమ్మ సంబురాలు 

ఖమ్మం కల్చరల్‌: తీరొక్క పూలతో బతుకమ్మ సంబురాలు ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం ఖమ్మం నగరం పూలశిఖరమైంది.. పలు రకాల పూలు బతుకమ్మగా ఒదిగి పూజలందుకున్నాయి.. పేర్చిన బతుకమ్మల మధ్యలో జగన్మాత గౌరమ్మను ఆడబిడ్డలు భక్తి ప్రపత్తులతో పూజించారు. తమను చల్లంగా చూడాలని, సకల సౌభాగ్యాలు పెంచాలని ప్రార్థించారు. వర్షంలోనూ మహిళలు బతుకమ్మను  ఉత్సాహంగా ఓలలాడించి అలరించారు. నగరంలోని 16వ డివిజన్‌లో పాకబండ బజార్‌ రోడ్‌నెంబర్‌ 4లో కార్పొరేటర్‌ కమర్తపు మురళి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. 12 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేసి, వాటి చుట్టూ చిన్నా, పెద్ద పలు పరిమాణాల్లోని బతుకమ్మలను అమర్చి బతుకమ్మ ఆటపాటలాడి సందడి చేశారు. తొలుత బతుకమ్మకు కార్పొరేటర్‌ కమర్తపు మురళి సరిత దంపతులు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు.