బుధవారం 25 నవంబర్ 2020
Khammam - Oct 20, 2020 , 03:00:31

గాయత్రీ దేవీ.. నమోస్తుతే..

గాయత్రీ దేవీ.. నమోస్తుతే..

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పలు ఆలయాల్లో జగన్మాత శ్రీగాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గుట్టలబజార్‌ శ్రీకన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, శాస్ర్తోక్తంగా జరుగుతున్నాయి. స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి పారువేట జమ్మిబండ వద్ద భక్తులు దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం నగరం పాండురంగాపురం శ్రీరామలింగేశ్వర ఆలయంలో శ్రీదేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువలా సాగుతున్నాయి.  

-ఖమ్మం కల్చరల్‌/ రఘునాథపాలెం