బుధవారం 21 అక్టోబర్ 2020
Khammam - Oct 01, 2020 , 00:15:19

విద్యార్థి నాయకులు సైనికుల్లా పనిచేయాలి

విద్యార్థి నాయకులు సైనికుల్లా పనిచేయాలి

  • పట్టభద్రుల ఎన్నికల్లో సత్తా చాటాలి 
  • ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్‌ఎస్‌కే మద్దతు
  • రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌
  • టీఆర్‌ఎస్‌ భవన్‌లో టీఆర్‌ఎస్‌వీ సన్నాహక సమావేశం
  • హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్‌ యాదవ్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత విద్యార్థి విభాగం నాయకుల దేనని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ అనుబంధ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని మంత్రి పిలుపునిచ్చారు. 

ఖమ్మం : రానున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మేజార్టీతో గెలిపించేలా  టీఆర్‌ఎస్వీ నాయకులు సైనికుల్లా పని చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఫలాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పథకాల ప్రతి ఇంటికి చేరుతున్నాయని, పట్టభద్రుల స్థానంలో పట్టం కట్టి టీఆర్‌ఎస్‌ గెలిచే విధంగా పని చేయాలన్నారు.

ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రతి కార్యకర్త పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై చేసే అబద్దపు ప్రచారాలను సమర్ధవంతంగా తిప్పి కొట్టే విధంగా వ్యవహరించాలని అన్నారు.  తెలంగాణ ఆవిర్భవించిన తరువాత ఐటీ రంగంలో 7.5 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలోచ్చాయని మంత్రి పువ్వాడ అన్నారు. పట్టభద్రులందరూ తెలంగాణ ఉద్యమం నుండే ఎదిగి వచ్చిన వారేనని వారందరూ టిఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నారని, వారందరితో ఓట్లు వేయించుకోగలగాలని అన్నారు.  ఈ నెల 1వ తేదీ నుంచి గ్రామ గ్రామాన పట్టభద్రులను గుర్తించి వేగంగా ఓట్లు నమోదు చేయించాలని మంత్రి అన్నారు. పట్టభద్రులు అంటేనే పరిణితి చెందిన వారని, వారిలో మన పట్టును చాటాలని మంత్రి తెలిపారు.  ఆరు సంవత్సరాల్లోనే 60 ఏండ్ల అభివృద్ధి జరిగిందని, వ్యవసాయ రంగంలో దేశంలో తెలంగాణ అగ్రభాగాన నిలవడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనకు నిదర్శంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో జరుగనున్న పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి పువ్వాడ పిలులపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమైనదన్నారు. టీఆర్‌ఎస్‌వి నాయకులు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.  అనంతరం విద్యార్థి సంఘ జడల కళ్యాణ్‌, గెల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌వీలో చేశారు. షేక్‌ బాజీబాబా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాత మధు, జిల్లా కార్యాలయ ఇంచార్జీ ఆర్‌జెసీ కృష్ణ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, నగర మేయర్‌ జి.పాపాలాల్‌, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీ ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ, టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి  రడం సురేష్‌ గౌడ్‌, దిలీప్‌ చౌదరి, వెంకట్‌గౌడ్‌, ఖమ్మం జిల్లా కో ఆర్డీనేటర్లు నియోజకవర్గ కో ఆర్ఢినేటర్లు శివ, గణేష్‌ , గోపి, మహేష్‌, సాద్‌, రియాజ్‌, పవన్‌, మురళి, రాము, పవన్‌ తదితరులు పాల్గొన్నారు. logo