మంగళవారం 20 అక్టోబర్ 2020
Khammam - Sep 29, 2020 , 04:36:12

ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి

ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి

చింతకాని: పల్లెల్లో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అఖండ మెజార్టీ అందించాలని జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజు అన్నారు. సోమవారం రామకృష్ణాపురంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కన్నెబోయిన కుటుంబరావుతో కలిసి ఓటు నమోదు ప్రక్రియను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రతి పట్టభద్రుడూ ఓటు హక్కు పొందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కన్నెబోయిన కుటుంబరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మంకెన రమేశ్‌, మండల నాయకులు నూతలపాటి వెంకటేశ్వర్లు, బొడ్డు వెంకటరామారావు, పోల్పీడు కొండలరావు, పిన్నెల్లి శ్రీను, కొర్లపాటి అంజి, శెట్టి సురేశ్‌, మోహన్‌రావు, టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు, పట్టభద్రులు పాల్గొన్నారు.    


logo