మంగళవారం 20 అక్టోబర్ 2020
Khammam - Sep 27, 2020 , 04:36:49

సుందర ఖమ్మంగా తీర్చిదిద్దుతాం..

  సుందర ఖమ్మంగా తీర్చిదిద్దుతాం..

  • తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలి
  • ఖమ్మం నగరంలో అందుబాటులోకి మరో 30 స్వఛ్ఛ ఆటోలు
  • ప్రజల సౌకర్యార్థం మోడ్రన్‌ టాయిలెట్ల నిర్మాణం 
  • ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం : తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించేందుకు ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార పేర్కొన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించేందుకు ఒక్కొక్కటి రూ.5.24లక్షల విలువగల 30 స్వచ్ఛ ఆటోలను శనివారం నగరంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, నగర మేయర్‌ పాపాలాల్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా తడి, పొడి చెత్త విడివిడిగా సేకరణ జరగాలని, మెప్మా సిబ్బంది సమన్వయంతో సెగ్రిగేషన్‌ జరిగే డివిజన్‌లలో మొదటి ప్రాధాన్యతనివ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చెత్త సెగ్రిగేషన్‌ ద్వారా వందశాతం చెత్త రీసైక్లింగ్‌ జరుగుతుందన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా ప్రజల్లో మార్పు తేవాలని, నూతన విధానాలను ప్రజలు అవలంభించే విధంగా వివిధ మాద్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. డంపింగ్‌ యార్డులతో పాటు ఆయా డివిజన్‌లలో సెగ్రిగేషన్‌ షెడ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. 

ప్రజల సౌకర్యార్థం మోడ్రన్‌ టాయిలెట్‌లు..

ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్‌లో ప్రజల సౌకర్యార్థం మోడ్రన్‌ పబ్లిక్‌ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. నగరంలోని 30, 31, 47 డివిజన్‌లలోని స్టేషన్‌రోడ్‌, ఆర్డీఓ కార్యాలయం, నయాబజార్‌ ప్రాంతాల్లో ఒకొక్కటి రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మూడు పబ్లిక్‌ టాయిలెట్‌లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు సూచనల మేరకు నగర జనాభాకు అనుగుణంగా ప్రతి డివిజన్‌ పరిధిలో మోడ్రన్‌ టాయిలెట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో 40 ప్రాంతాల్లో 188 టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని

ఇప్పటికే 142 పూర్తి చేశామని, మిగిలిన వాటిని కూడా త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, అసిస్టెంట్‌ కమిషనర్‌ మల్లీశ్వరీ, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ కార్యాలయ ఇన్‌ఛార్జ్‌ ఆర్‌జేసీ కృష్ణ , కార్పొరేటర్‌ కమర్తపు మురళి, కార్పొరేటర్లు, డీఈలు రంగారావు, ధరణీకుమార్‌, కార్పొరేటర్లు అప్రోజ్‌సమీనా, మాటేటి నాగేశ్వరరావు, పాలడుగు పాపారావు, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి, కనకం లక్ష్మి, దరావత్‌ రాంమ్మూర్తి, టీఆర్‌ఎస్‌ నాయకులు కనకంభద్రయ్య, కన్నం ప్రసన్న కృష్ణ ,రుద్రగాని ఉపేందర్‌, తోట వీరభద్రం, బాణాల లక్ష్మణ్‌, చిన్న మల్లేశం, సంబంధిత శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. logo