మంగళవారం 27 అక్టోబర్ 2020
Khammam - Sep 26, 2020 , 00:22:51

సిరులు కురిపిస్తున్నఎర్ర బంగారం

సిరులు కురిపిస్తున్నఎర్ర బంగారం

  • క్వింటా రూ.20వేలకు చేరిన ఏసీ మిర్చి ధర
  • జాతీయ మార్కెట్లో మనపంటకు డిమాండ్‌
  • పోటీపడి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
  • ఆనందంలో అన్నదాతలు

ఖమ్మం వ్యవసాయం : నిన్నా మొన్నటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న మిర్చి ధర నేడు అమాంతం పెరిగి రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. ఫలితంగా రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పక్షం రోజుల నుంచి పెరుగుకుంటూ వచ్చిన ఏసీ రకం తేజా మిర్చి ధర శుక్రవారం మరింత పెరగిపోయింది. ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన జెండాపాటలో గరిష్ట ధర రూ. 20,175 పలుకుగా, మధ్య ధర రూ. 18,200, కనిష్ట ధర రూ.15వేల చొప్పున నిర్ణయించి వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. ఉదయం జెండాపాటలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ పాల్గొన్నారు. జెండాపాటలో ఖచ్చితమైన ధర నిర్వహించి అందుకు అనుగుణంగా ఇతర రైతుల పంట ఉత్పత్తులు కొనుగోలు జరిగే విధంగా ఆయన పర్యవేక్షించారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో సాగు జరిగే తేజారకం పంటకు మంచి డిమాండ్‌ రావడంతో లోకల్‌ వ్యాపారులతో పాటు ఇతర రాష్టాల వ్యాపారులు సైతం పంటను కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారం రోజుల నుంచి పొరుగుజిల్లాల రైతులు సైతం తిరిగి తమ పంటను మార్కెట్‌యార్డులో అమ్మకానికి పెడుతున్నారు. logo