ఆదివారం 25 అక్టోబర్ 2020
Khammam - Sep 26, 2020 , 00:22:56

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి.. కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి.. కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలి

  • గ్రాడ్యుయేట్స్‌ ఎన్నికలను  ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
  • ఓటరు నమోదులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి
  • మంత్రి పువ్వాడ కృషితో మారిన ఖమ్మం రూపురేఖలు
  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి
  •  ఖమ్మం, వైరాల్లో ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం

ఖమ్మం: రానున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి అన్నారు. పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని సూచించారు. ఖమ్మంలోని తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ ఆధ్వర్యంలో ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూకల నరేశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రతి కార్యకర్తా తన చుట్టుపక్కల ఏ ఒక్క పట్టబద్రుడి ఓటునూ వదలకుండా ఓటు నమోదు బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. 2017కు ముందు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరినీ కలిసి వారి వద్ద నుంచి సర్టిఫికెట్లను జిరాక్సులు తీసుకొని వారికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. ఎన్నికల రోజున వారితో ఓటు వేయించే బాధ్యతలను కూడా కార్యకర్తలే తీసుకోవాలన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కృషితో ఖమ్మం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని గుర్తుచేశారు.

మన తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని అన్నారు. ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మేయర్‌ జీ.పాపాలాల్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమలరాజు, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ ఖమ్మం నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, రఘునాధపాలెం మండల అధ్యక్షులు కుర్రా భాస్కర్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, సుడా సలహా మండలి సభ్యులు కొల్లు పద్మ, రమేష్‌గౌడ్‌, గూడ సంజీవరెడ్డి, డిప్యూటి మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, ఖమ్మం రూరల్‌ జడ్పీటీసీ ఎడ్లపల్లి వరప్రసాద్‌, ఎంపీపీ బెల్లం ఉమ, రూరల్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బెల్లం వేణు, నాయకులు బ్రహ్మయ్య, సత్యనారాయణ, భాషా, వీరన్న, మంగీలాల్‌, శ్రీనివాసరెడ్డి, కృష్ణ, పుల్లయ్య, ఎం.శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వీ.ప్రసాద్‌, మంకెన రమేష్‌, నూతలపాడు వెంకటేశ్వరరావు, వెంకటప్రసాద్‌, సురేష్‌, రమేష్‌, కార్పోరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో  సత్తా చాటాలి

వైరా: త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధ్యక్షులు, కమిటీ సభ్యులతో శుక్రవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన

ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రులను గుర్తించి వారి ఓట్లను నమోదు చేయించాలని సూచించారు. వైరా నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో పట్టభద్రుల ఓటర్లను చేర్పించి ఎన్నికల సమయంలో ఆ ఓట్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి పడే విధం గా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయ క్‌ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఓటర్లను చేర్పించాలన్నారు. మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మండలాల అధ్యక్షులు పసుపులేటి మోహన్‌రావు, కోసూరి శ్రీనివాసరావు, బానోత్‌ సురేష్‌, భూక్యా లాలు, చౌడం నర్సింహారావు, తోటకూర పిచ్చయ్య, ఆత్మ చైర్మన్‌ ముత్యాల సత్యనారాయణ పాల్గొన్నారు. 



logo