మంగళవారం 27 అక్టోబర్ 2020
Khammam - Sep 17, 2020 , 01:59:23

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ఖమ్మం : ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సిఫార్సుతో మంజూరైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్‌లను బుధవారం ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందచేశారు. ఖమ్మం రూరల్‌, తిరుమలాయపాలెం, కూసుమంచి , కారేపల్లి, ఏన్కూరు,

జూలూరుపాడు మండలాలకు చెందిన పలువరు లబ్ధిదారులకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, పార్టీ నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ మరికంటి ధనలక్ష్మి, వైరా జడ్పీటీసీ కనకదుర్గ, నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య. టీఆర్‌ఎస్‌ కారేపల్లి మండల అధ్యక్షుడు తోటకూరి పిచ్చయ్య, ఆత్మ కమిటీ చైర్మన్‌ ముత్యాల సత్యనారాయణ,

సొసైటీ చైర్మన్‌ దుగ్గిని శ్రీనివాసరావు కలిసి మొత్తం 15 మంది లబ్ధిదారులకు రూ.6.12 లక్షల విలువైన చెక్కులు అందించారు. నామా క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి కనకమేడల సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


logo