మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Khammam - Sep 16, 2020 , 04:21:59

ప్రభుత్వ వెసలుబాటును సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ వెసలుబాటును సద్వినియోగం చేసుకోవాలి

  • వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

కొత్తగూడెం : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన వెసలుబాటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వివిధ అంశాలపై వ్యవసాయ, పంచాయతీ, విద్యుత్‌, మిషన్‌ భగీరథ, మున్సిపల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పనులపై సమీక్షించారు. జిల్లాలో 1831 పంట కల్లాలు ఏర్పాటు లక్ష్యం కాగా 542 పనులకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చామని, రానున్న వారం నాటికి మిగిలిన అన్ని పనులకు మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మండల ప్రత్యేక అధికారులు ప్రతి శుక్రవారం తనిఖీ చేసి క్షేత్రస్థాయి లో జరుగుతున్న పనులపై నివేదికలు ఇవ్వాలన్నారు. జిల్లా లో 479 వైకుంఠధామాలు నిర్మాణం చేపట్టగా 79 మాత్ర మే నిర్మాణం పూర్తయ్యాయయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 151 డంపింగ్‌ యార్డులు మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయని, అన్ని అవకాశాలు కల్పించి నిధులు మంజూరు చేసి నా ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో గౌతమ్‌, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, డీపీవో రమాకాంత్‌, డీఆర్‌డీఏ పీడీ మధుసూధన్‌రాజు, పీఆర్‌ ఈఈ సుధాకర్‌, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, విద్యుత్‌ ఎస్‌ఈ సురేందర్‌ పాల్గొన్నారు.logo