ఆదివారం 25 అక్టోబర్ 2020
Khammam - Sep 09, 2020 , 07:31:02

మంత్రి పువ్వాడకు కేసీఆర్‌ ఆశీస్సులు

మంత్రి పువ్వాడకు  కేసీఆర్‌ ఆశీస్సులు

మంత్రి పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్‌ బుధవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలని, ఉమ్మడి ఖమ్మాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎం ఈ సందర్భంగా మంత్రి అజయ్‌కి సూచించారు..    - ఖమ్మం

ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం నగరం వ్యాప్తంగా ఫ్లెక్సీలు, కటౌట్లు  ఏర్పాటు చేసిన మంత్రి పువ్వాడకు శుభాకాంక్షలు తెలిపారు. కాల్వొడ్డు, మయూరిసెంటర్‌, బస్టాండ్‌ సెంటర్‌, జడ్పీ సెంటర్‌, ఇల్లందు క్రాస్‌రోడ్‌, రోటరీనగర్‌, ఇల్లెందురోడ్‌, బస్‌డిపో రోడ్‌, బైపాస్‌, ముస్తాఫానగర్‌, బోనకల్‌ రోడ్‌, శ్రీనివాసనగర్‌, గాంధీచౌక్‌, చర్చికాంపౌండ్‌ సెంటర్‌,

  మున్సిపల్‌ ఆఫీస్‌ , గట్టయ్య సెంటర్‌ తదితర ప్రదేశాలు గులాబీమయం అయ్యాయి. పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని అనేక గ్రామాలు, భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనేక ప్రాంతాల్లోనూ నాయకులు వేడుకలు నిర్వహించారు. అనేక మంది నాయకులు మంత్రికి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పువ్వాడను హైదరాబాద్‌లో వైరా, కొత్తగూడెం శాసన సభ్యులు లావుడ్యా రాములునాయక్‌, వనమా వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి దంపతుల ఆశీస్సులు 

హైదరాబాద్‌లో మంగళవారం మంత్రి అజయ్‌కుమార్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌, శోభమ్మ దంపతులను కలిసి ఆశీస్సులు పొందారు. ప్రజాసేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని వారు మంత్రిని ఆశీర్వదించారు. అలాగే రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి మంత్రి అజయ్‌ పుష్పగుచ్ఛం అందజేశారు.

సేవా కార్యక్రమాలు

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మంలోని టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో  ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి ఆర్జేసీ కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమలరాజ్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో మేయర్‌ జి.పాపాలాల్‌, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీ ప్రసాద్‌, డీసీసీబీ చైర్మన్‌ కురాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖమర్‌, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, పగడాల నాగరాజు, 

టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు  తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో పార్టీ చెందిన కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వెలుగుమట్ల ఫారెస్ట్‌ పార్కులో హరితహారం నిర్వహించి సుమారు వెయ్యి మొక్కలు నాటారు. పలు డివిజన్లలో నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. పార్టీ నగర మైనారిటీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు అందజేశారు.

గ్రానైట్‌ కార్మికులు ఇండస్ట్రీయల్‌ ఏరియాలో కేక్‌ కట్‌ చేశారు. మధిర నియోజకవర్గం ముదిగొండ మండల కేంద్రం పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్‌ కట్‌ చేశారు. చింతకాని మండలంలోని రామకృష్టాపురంలో పలువురు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి పువ్వాడ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంతో పాటు గణేష్‌పాడు పంచాయతీలో నాయకులు కరోనా బాధితులకు నిత్యావసర సరుకులను టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు చింతనిప్పు కృష్ణచైతన్య పంపిణీ చేశారు.logo