వాకర్స్ ప్యారడైజ్

ఖమ్మానికి మరో మణిహారంనగరంలో మినీ లకారం చుట్టూ వాకింగ్ ట్రాక్ఖమ్మం మరో మణిహారాన్ని అలంకరించుకోనుంది.. మొన్నటికి మొన్న లకారం ట్యాంక్ బండ్తోప్రశంసలందుకున్న నగరం ఇప్పుడు మినీ లకారం పార్క్‌తో కొత్త శోభను సంతరించుకోనుంది..నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు పార్క్ యుద్ధ ప్రాతిపదికన పనులుపూర్తి చేసుకుంటున్నది.. మంత్రి అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని పార్క్ పనులు పూర్తి చేయించారు. కరోనా ఉధృతి తగ్గగానే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు..నాడు మురికి కూపం.. నేడు రమణీయ ప్రదేశం. ఇది ఖమ్మం మినీ లకారం చెరువు రూపుదిద్దుకున్న తీరు. తెలంగాణ ఏర్పడ్డాక పర్యాటక రంగానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నది. అంతేకాకుండా నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పార్కులు, ట్యాంక్‌బండ్‌లను నిర్మిస్తున్నది. ఖమ్మం ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవతో ఇప్పటికే ఖమ్మానికి మణిహారం గా లకారం ట్యాంక్ బండ్ విరాజిల్లుతుండగా దాని పక్కనే మురికి కూపంగా ఉన్న మినీ లకారం చెరువుకు కొత్త శోభవచ్చింది. మంత్రి అజయ్ ప్రత్యేక కృషితో రూ.9 కోట్లతో చెరువు ఆధునీకరణ పనులు చేయించారు. మినీ ట్యాంక్ బండ్‌గా మార్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసి వాకర్స్ ప్యారడైజ్‌గా నామకరణం చేశారు. అలాగే నగరవాసులు యోగా చేసుకునేందుకు ప్రత్యేకంగా ఐలాండ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెరువు సుందరీకరణ పనులన్నీ పూర్తయ్యాయి. వచ్చేనెలలో మినీలకారం నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచనుంది.
- ఖమ్మం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి హరితహారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది.దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకవచ్చిన నూతన పురపాలక చట్టంలో పొందుపర్చిన విధంగా మున్సిపల్ నిధులలో 10 శాతం నిధులను హరితహారానికి ఖర్చు చేయాల్సి ఉంది. ఈ ఏడాది హరితహారంలో మినీ లకారం ట్యాంక్ బండ్‌ను నిర్మాంచాలని మంత్రి పువ్వాడ నిర్ణయించారు.రెండేళ్ల క్రితం వరకు లకారం ట్యాంక్ బండ్ పనులను పెద్ద ఎత్తున చేపట్టి ప్రజల ముందుకు తీసుకవచ్చారు. దీంతో ఖమ్మం ప్రతిష్ట మరింత పెరిగింది. ఇప్పుడు ఇటీవల వరకు కూడా మురికి కూపంగా ఉన్న మినీ లకారం చెరువును అనేక మంది రియల్ వ్యాపారులు కబ్జాలు చేశారు. చెత్తాచెదారంతో నిండిపోయి ఉండేది. దీనిని గమనించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మినీ లకారం చెరువు రూపురేఖలు మర్చాలని నిర్ణయించారు.
సుందర మినీ లకారం..
కార్పొరేషన్‌కు సంబంధించిన సుమారు రూ.9 కోట్లతో మినీ లకారం చెరువు పనులను చేపట్టారు. చెరువులో సిల్ట్‌ను తొలగించి చెరువు చుట్టూ కరకట్టను నిర్మించారు. మురికి నీళ్లు రాకుండా ప్రత్యేక కాలువను నిర్మించి సాగర్ కాలువ ద్వారా ప్రత్యేక కాలువను నిర్మించి స్వచ్ఛమైన నీటితో మినీ చెరువును నింపారు. అంతేకాకుండా అటవీశాఖ సహకారంతో చెరువు చుట్టూ దాదాపు ఐదు వేల మొక్కలను నాటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం మేరకు మంకీ కోర్టును నిర్మించారు. దీనిలో కేవలం పండ్ల మొక్కలను మాత్రమే నాటారు. చెరువు చుట్టూ 1.7 కిలో మీటర్ల పొడవున వాకింగ్ ట్రాక్ నిర్మించారు. అంతేకాకుండా యోగా చేసుకునేందుకు ప్రత్యేకంగా ఐలాండ్ ఏర్పాటు చేశారు. చెరువులో నీళ్లు, చుట్టూరా వాకింగ్ ట్రాక్, లైట్ల కాంతులు, మధ్య, మధ్యలో కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు. చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆహ్లాదాన్ని పంచుతుంది.
వాకర్స్ ప్యారడైజ్‌గా నామకరణం
ఖమ్మం నగరంలో అనేక ప్రదేశాల్లో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్లు చేస్తుంటారు. కొన్ని చోట్ల ఇరుకుగా స్థలాలు ఉండటం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.మినీ లకారం చుట్టూ నిర్మించిన వాకింగ్ ట్రాక్‌కు వాకర్స్ ప్యారడైజ్‌గా నామకరణం చేశారు. మరో నెలలో అందుబాటులోకి రాగానే నామినల్ సభ్యత్వ రుసుంతో ప్రవేశం ఉంటుంది. అదికూడా నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సర చొప్పున సభ్యత్వాలను ఇవ్వడం జరుగుతుంది. పది సంవత్సరాల లోపు పిల్లలకు ఎలాంటి ఫీజు ఉండదు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. సభ్యత్వాలు కాకుండా కూడా అప్పుడప్పుడు వచ్చే వారి కోసం ఆ రోజు కారోజు ఫీజు వసూలు చేయనున్నారు.
నగర ప్రజలకు వాకర్స్ ప్యారడైజ్
- యోగా, ఇతర వ్యాయామాల కోసం ఐలాండ్ ఏర్పాటు
- రాష్ట్ర రావాణాశాఖ మంత్రిపువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం : ఖమ్మం నగర ప్రజలకు మినీ ట్యాంక్‌బండ్‌లో వాకర్స్ పార్యడైజ్ ను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర రావాణాశాఖ మంత్రిపువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మినీ ట్యాంక్ బండ్ ఐలాండ్‌లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ డాక్టర్ పాపాలాల్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మం నగరానికే తలమానికంగా ఉన్న ట్యాంక్‌బండ్‌లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కేవలం మూడు నెలలో మినీ లాకారం ట్యాంక్ బండ్‌ను అభివృద్ధ్ది చేశామన్నారు.
కొవిడ్-19 నిబంధనలు తొలగించిన వెంటనే పార్కులు తిరిగి ప్రారంభిస్తామన్నారు. నగరంలో వాకర్స్ కోసం మిని ట్యాంక్ బండ్లో 1.6కిలోమీటర్లు వాకింగ్ ట్రాక్‌తో పాటు గ్రీనరీ, ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేశామన్నారు. యోగా, ఇతర వ్యాయామాల కోసం ఐలాండ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉన్న సర్దార్ పటేల్ స్టేడియంలో ఇరుకుగా వాకింగ్ చేయాల్సి వస్తుందని, కానీ లకారం ట్యాంక్ బండ్లో సువిశాలంగా వాకింగ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. వాకర్స్ క్లబ్ ఏర్పాటు చేసి వార్షిక, అర్థవార్షిక, నెలవారీ సభ్యత్వాలకు అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ముందు చూపుతో నేడు ఖమ్మంనగరం శరవేగంగా అభివృద్ధిలో దూసుకపోతుందన్నారు.
నగరంలో ఆధునిక టాయిలెట్లు, నూతన బస్షెల్టర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఎంతో కాలంగా ఉన్న ధంసలాపురం, రఘునాథపాలెం రోడ్లు విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం 10శాతం నిధులు నగరంలో గ్రీనరీకి వాడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్‌జయంతి, జిల్లా అటవీశాఖ అధికారి ప్రవీణ, ఫ్లోర్‌లీడర్ కర్నాటి కృష్ణ, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జ్ ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్ నారాయణరావు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’