గురువారం 04 మార్చి 2021
Khammam - Aug 16, 2020 , 00:09:28

తెలంగాణ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం

తెలంగాణ భవన్‌లో  స్వాతంత్య్ర దినోత్సవం

  • పాల్గొన్న మంత్రి అజయ్‌కుమార్‌, నాయకులు

ఖమ్మం : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్‌లో గల టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్‌లో వేడుకలను  శనివారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జాతీయజెండాను ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తితో వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం టీఆర్‌ఎస్‌పార్టీ అనుబంధ విభాగాల కు, జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన గదులు కేటాయించారు. వీటిని సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు  ప్రారంభించారు. 

మీటింగ్‌ హాల్‌ గదికి మంత్రి శంకుస్థాపన

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించేందుకు పార్టీ జిల్లా కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న గదికి మంత్రి అజయ్‌కుమార్‌ శనివారం శంకస్థాపన చేశారు. కార్యక్రమంలో ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కమలరాజ్‌, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ, డీసీసీబీ చైర్మన్‌ కురాకుల నాగభూషణం, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, బత్తుల మురళి, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, రమాదేవి, ప్రజాప్రతినిధులు, సుడా సలహా మండలి సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo