మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Khammam - Aug 11, 2020 , 03:27:27

ఉద్యాన పంటలు ఆర్థిక భరోసా..

ఉద్యాన పంటలు  ఆర్థిక భరోసా..

  • రాయితీలు పటిష్టంగా అమలు చేయాలి
  • రాష్ట్ర ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూదన్‌

ఖమ్మం వ్యవసాయం: ఉద్యాన పంటల సాగే ఆర్థికాభివృద్ధికి ఊతమని రాష్ట్ర ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.మధుసూదన్‌ అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ అనసూయతో కలిసి ఆయన  సోమవారం ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించారు. తొలుత రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామంలో పర్యటించి అక్కడ సాగు చేస్తున్న ఉద్యాన పంటలను పరిశీలించారు. గ్రామంలో పెంచుతున్న మిర్చి నర్సరీలు, ఆయిల్‌ఫాం పంట క్షేత్రాలను పరిశీలించారు. అనంతరం ఖమ్మం రూరల్‌ మండలం ఎంవీ పాలెం, గూడూరుపాడు, గ్రామాల్లో పర్యటించి అక్కడి మల్బరీసాగు తోటలను, పట్టుపురుగుల పెంపకం షెడ్‌లను సందర్శించారు. అక్కడి నుండి నేరుగా ఖమ్మం నగరంలోని జిల్లా కార్యాలయానికి చేరుకొని శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పోర్టల్‌లో ఉద్యాన, పట్టు పరిశ్రమ పంటల వివరాలు వందశాతం నమోదు కావాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉద్యాన పంటల సాగు  ఎంతో మేలు  చేస్తుందన్నారు. ఇందుకోసం జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.   కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఉద్యానశాఖ అధికారులు జీ సందీప్‌, జీ నగేశ్‌, సురేశ్‌తో పాటు ఏఎస్‌ఓ  పాల్గొన్నారు.


logo