శనివారం 26 సెప్టెంబర్ 2020
Khammam - Aug 10, 2020 , 01:02:16

ముత్యాలమ్మా చల్లంగ చూడమ్మా

ముత్యాలమ్మా చల్లంగ చూడమ్మా

  •  గ్రామాలకు ఆధ్యాత్మిక శోభ   
  • పలుచోట్ల గ్రామదేవతల విగ్రహాల ప్రతిష్ఠ 
  • బోనమెత్తిన మహిళలు   
  • పంటలు బాగా పండాలని మొక్కులు

‘ముత్యాలమ్మా.. చల్లంగ చూడవమ్మా.. పాడి పంటలు సమృద్ధిగా పండించవమ్మా..’ అంటూ భక్తులు పూజలు చేశారు. శ్రావణమాసం సందర్భంగా ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠలు, బోనాల సమర్పణలు వంటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. మహిళలందరూ బోనాలు నెత్తిన పెట్టుకొని వెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. నైవేద్యాలు సమర్పించుకున్నారు. గ్రామదేవత అయిన ముత్యాలమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ప్రదర్శనల సందర్భంగా ఆమ్మవారు ఆవహించడంతో శివసత్తువుల నోటి నుంచి వచ్చే పలుకులను భక్తులు ఆసక్తిగా ఆలకించారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్థిల్లేలా చల్లంగ చూడాలని అమ్మవార్లను వేడుకున్నారు. అలాగే ఇల్లెందు మండలం బాలాజీనగర్‌ గ్రామ పంచాయతీలో గ్రామదేవతల విగ్రహాల ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు. అనంతరం గ్రామ వీధుల్లో విగ్రహాలను ఊరేగించి ప్రత్యేకంగా నిర్మించిన ఆలయాల్లో నాభిశిలను, ముత్యాలమ్మ విగ్రహాలను వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రతిష్ఠించారు.   

 -నెట్‌వర్క్‌


logo