సోమవారం 26 అక్టోబర్ 2020
Khammam - Aug 09, 2020 , 00:04:04

కొవిడ్‌ పరీక్షలపై అసత్య ప్రచారాద్దు

కొవిడ్‌ పరీక్షలపై అసత్య ప్రచారాద్దు

  • ప్రజలను భయాందోళనలకు గురిచేయొద్దు
  • వినకుంటే కఠిన చర్యలు: ఖమ్మం ఆర్వీ కర్ణన్‌

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖమ్మం జిల్లాలో కొవిడ్‌-19 పరీక్షలు జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ స్పష్టం చేశారు. జిల్లా ప్రధానాసుపత్రిలోని కొవిడ్‌-19 పరీక్షా కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలను భయాందోళనలకు గురిచేసే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఎపిడమిక్‌ యాక్ట్‌ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రధానాసుపత్రిలో ప్రతి రోజూ ట్రూనాట్‌ పరీక్షలు 50 మందికి చేస్తున్నామన్నారు. 250 మంది వరకు ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాపిడ్‌ టెస్టుల్లో నెగిటివ్‌ వచ్చి కరోనా లక్షణాలు ఉన్నవారికి ట్రూనాట్‌ పరీక్షలు కూడా చేస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా వైద్యశాల్లో కూడా ర్యాపిడ్‌ పరీక్షలు చేస్తున్నామని వివరించారు. ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మరాదని పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాలతి, జిల్లా వైద్యారోగ్యాధికారులు పాల్గొన్నారు.

వైద్యులు బాధ్యతగా విధులు నిర్వహించాలి

కొవిడ్‌-19 నియంత్రణలో వైద్యులు మరింత బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సూచించారు. కలెక్టర్‌ కార్యాలయ ప్రజ్ఞా సమావేశ మందిరంలో నూతనంగా నియామకమైన వైద్యులకు శనివారం పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో విధులు నిర్వహించేందుకు 15 మంది వైద్యులను నియామకం చేశామన్నారు. ఉత్తర్వులు పొందిన వైద్యులు వెంటనే విధుల్లో చేరి వైద్యాధికారుల సూచనలు, సలహాల మేరకు పనిచేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, ఏవో మదన్‌గోపాల్‌ పాల్గొన్నారు.  


logo