గురువారం 29 అక్టోబర్ 2020
Khammam - Aug 08, 2020 , 01:48:03

అల్లంత దూరాన సాగర్‌ జలాలు

అల్లంత దూరాన  సాగర్‌ జలాలు

u రేపు పాలేరుకు చేరుకోనున్న సాగునీరు

u సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్‌ 

u నీరు విడుదల చేయాలని వినతి.. స్పందించిన ముఖ్యమంత్రి.. 

u విడుదలకు అధికారులకు ఆదేశం

u ఎన్నెస్పీ రెండో జోన్‌కు అందనున్న సాగునీరు

u సాగర్‌ ఆయకట్టు రైతుల్లో ఆనందం

ఎన్నెస్పీ రెండో జోన్‌లోని ఆయకట్టు భూములకు  పుష్కలంగా సాగునీరు    అందనుంది.. మంత్రి పువ్వాడ   అజయ్‌కుమార్‌ కృషితో సాగర్‌ నుంచి నీటి విడుదలకు మార్గం సుగమమైంది.       వానకాలం పంటలకు అవసరమైన నీటిని        విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని    శుక్రవారం సీఎం కేసీఆర్‌ను కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే నీటి విడుదలకు చర్యలు         చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. ఆదివారం సాయంత్రానికి కృష్ణా జలాలు పాలేరుకు   చేరుకుంటాయి.. ఇక్కడి నుంచి వైరా,   లంకాసాగర్‌, చెరువుమాదారం మేజర్  చెరువులతోపాటు మరో 330    చెరువులను నింపనున్నారు. జిల్లాలోని చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందుతుండటంతో రైతులు హర్షం   వ్యక్తం చేస్తున్నారు..

-కూసుమంచి


 కూసుమంచి : ఈ ఏడాది సాగు సంబురంగా సాగుతోంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో రైతులు ప్రభుత్వం చూసించిన పంటలు సాగు చేస్తున్నారు. పంట చివరి వరకు సాగునీరు అందించేందుకు సాగర్‌ నీరు విడుదల చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సీఎం కేసీఆర్‌ను కోరడంతో స్పందించిన ముఖ్యమంత్రి సాగర్‌ నీరు విడుదలకు అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం సాయంత్రం సాగర్‌ నుంచి నీటిని విడుదల చేశారు. ఆదివారం సాయంత్రానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పాలేరుకు చేరనుంది. పాలేరుతో పాటు వైరా, లంకాసాగర్‌, చెరువుమాదారం మేజర్‌ చెరువులతో పాటు జిల్లాలో 330 చెరువులను ఈ నీటితో నింపనున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగుల కాగా ప్రస్తుత నీటి మట్టం 556 అడుగుల ఉంది. వారంలో సాగర్‌ పూర్తిగి నిడుకునే అవకాశం ఉంది.

సాగునీటి గలగల

సాగర్‌ ఎడమ కాలువ కింద జిల్లా ఆయకట్టుకు ఒకటి రెండు రోజు ల్లో నీరు విడుదల చేయనున్నారు. పాలేరు ఆయకట్టులో కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్‌, ఖమ్మం అర్బన్‌, చింతకాని, కొణిజర్ల, వైరా, తల్లాడ, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు మండలాల్లో రెండో జోన్‌ కింద సాగు చేస్తున్నారు. కల్లూరు నుంచి కృష్ణా జిల్లా నూజివీడు వరకు మూడు జోన్‌ కింద సుమారు 3 లక్షల ఎకరాల్లో పంటలకు నీటిని పాలేరు నుంచే విడుదల చేస్తారు. సాగర్‌ మొదటి జోన్‌ నల్లగొండ , రెండో జోన్‌ ఖమ్మం, మూడో జోన్‌ కృష్ణా జిల్లా ఆయకట్టు ఉంది. 

చెరువులన్నీ నింపాలని మంత్రి అదేశం

పాలేరు రిజర్వాయర్‌ కింద జిల్లాలో ఉన్న సుమారు 330 చిన్న, పెద్ద చెరువులను పూర్తిగా సాగర్‌ నీటితో నింపాలని మంత్రి పువ్వాడ అజయ్‌మార్‌ ఇప్పటికే ఎన్‌ఎస్‌పీ అధికారులకు సూచించారు. పాలేరు, వైరా,లంకాసాగర్‌, చెరువుమాధారం, కల్లూరు వంటి పెద్ద చెరువులకు పూర్తిస్థాయిలో నీరు ఇవ్వాలని 16, 17 మెయిన్‌ బ్రాంచ్‌ కాలువ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. 

రేపు చేరనున్న కృష్ణా జలాలు

సాగర్‌ డ్యాంలో నీటిని విడుదల చేయడంతో ఆదివారం పాలేరు రిజర్వాయర్‌కు సాగర్‌ నీరు చేరుకోనుంది. ప్రస్తుతం పాలేరు నీటి మట్టం 19.5 అడుగు లు ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు. సాగర్‌ నీరు రిజర్వాయర్‌లోకి చేరిన వెంటనే దిగువ ఆయకట్టు రెండో జోన్‌కు వానకాలం పంటకు నీటిని విడుదల చేయనున్నారు. గతేడాది ఆగస్టు 14న ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సారి వారం రోజుల మందే నీరు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే నారుమళ్లు సిద్ధం చేసిన రైతులు నీరు విడుదలైన వెంటనే ఆయకట్టు కింద పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.