బుధవారం 30 సెప్టెంబర్ 2020
Khammam - Aug 05, 2020 , 23:54:27

‘గిఫ్ట్‌' ఏ స్మైల్‌

‘గిఫ్ట్‌' ఏ స్మైల్‌

ఖమ్మం:‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార కూడా భాగస్వామ్యమయ్యారు. కరోనా పరీక్షలు చేసేలా అన్ని సౌకర్యాలూ ఉన్న అంబులెన్స్‌ కొనుగోలుకు రూ.20.50 లక్షలను వితరణ చేశారు. ఆ చెక్కును రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు బుధవారం హైదరాబాద్‌లో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌ను యువనేత కేటీఆర్‌ అభినందించారు. జూలై 24న తన బర్త్‌డే వేడుకలను ఆడంబరంగా నిర్వహించకుండా.. ప్రజోపయోగాల కోసం మంచి కార్యక్రమాలు నిర్వహించాలని అంతకు ఒక రోజు ముందు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చిన విషయం విదితమే. తన వంతుగా కొవిడ్‌ పరీక్షల అంబులెన్సులను ప్రకటించారు. ఆ పిలుపునకు ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించి వారు కూడా తలా ఆరు చొప్పున అంబులెన్సులు ఇస్తామని ప్రకటించారు. తాజాగా ఆ ‘గిప్ట్‌ ఏ స్మైల్‌'లో భాగస్వామ్యమైన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కూడా అంబులెన్స్‌ కొనుగోలు కోసం రూ.20.50 లక్షలు ప్రకటించి ఆ చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.   


logo