ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Khammam - Aug 05, 2020 , 02:07:53

విధి నిర్వహణలో జాగ్రత్తలు ముఖ్యం

విధి నిర్వహణలో జాగ్రత్తలు ముఖ్యం

కూసుమంచి: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, అదే క్రమంలో తగిన వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ వైద్యారోగ్య శాఖ సిబ్బందిని, ఆశవర్కర్లకు సూచించారు. కూసుమంచి ప్రాధమిక ఆరోగ కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని వసతుల గురించి డీడీవో డాక్టర్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ ఇవాంజలిలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఇప్పటి వరకు కొవిడ్‌ పరీక్షలు ఎన్ని చేశారు?. వాటి వివరాలు ఏమిటి? ఇంకా ఎన్ని కిట్లు ఉన్నాయి? గతంలో చేసిన పరీక్షలు చేసిన వారి పరిస్థితి ఏమిటి? అనే విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.  

జ్వరం కేసులన్నీ నమోదు చేయండి

గ్రామాల్లో ఆర్‌ఎంపీల వైద్యంపై నిషేధం ఉంది కాబట్టి ఆశవర్కర్లు జ్వరం కేసులన్నీ నమోదు చేయాలని, జ్వరం వచ్చిన వారికి పరీక్షలు చేసి తగిన మందులు ఇవ్వాలని సూచించారు. అయినా తగ్గకపోతే తక్షణమే పీహెచ్‌సీకి తెలియజేయాలన్నారు. కాగా ఆసుపత్రి తనిఖీ అనంతరం ఆశవర్కర్ల నెలవారీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పీహెచ్‌సీలో కరోనా టెస్టు కిట్లు అందుబాటులో ఉన్నందున వాటిని వినియోగించుకోవాలని కోరారు. కరోనా ఎక్కువగా ప్రబలుతున్న సమయ ంలో ప్రజారోగ్యం విషయంలో జా గ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీహెచ్‌ఓ వలీయుద్దీన్‌, శ్రీనివాసరావు, నర్సు మమత పాల్గొన్నారు.


logo