శనివారం 08 ఆగస్టు 2020
Khammam - Aug 02, 2020 , 01:41:37

మీ ‘వన’ జీవితం భావితరాలకు ఆదర్శం

మీ ‘వన’ జీవితం భావితరాలకు ఆదర్శం

  • సిద్దిపేటలో వనజీవి పద్మశ్రీ రామయ్య దంపతులతో కలిసి భోజనం చేసిన మంత్రి హరీశ్‌రావు

ఖమ్మం రూరల్‌ : మీ వన జీవితం భావితరాలకు ఆదర్శం అని.. కోటి మొక్కలు నాటిన సంకల్పం నేటి యువతకు ఆదర్శం కావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌రావు ఇంట్లో పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులతో కలిసి భోజనం చేశారు. మంత్రే స్వయంగా వారికి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. మొక్కలు నాటాలని ఎందుకు అనిపించింది. ఎన్నాళ్లుగా ఈ పని చేస్తున్నారు అని మంత్రి అడిగారు. నా ఐదో ఏట నుంచే మొక్కలు నాటుతున్నాను. మనిషి మనుగడకు చెట్లే ఆధారం. ఒక చిన్న అగ్గిపుల్ల కూడా వచ్చేది మొక్క నుంచే అని పద్మశ్రీ సమాదానం ఇచ్చారు. మొక్కల నుంచి పూలు,

ఆక్సిజన్‌, ఔషధాలు ఇలా ఎన్నో వస్తాయి అని చెప్పారు. మరి జీవనాధారం ఏంటి అని అడుగగా వ్యవసాయం చేసేవాడిని అందులో కొంత నష్టం వచ్చింది. ఇప్పుడు నా కొడుకు చేసుకుంటున్నాడని చెప్పారు. ఇప్పటి వరకు కోటికి పైగా మొక్కలు నాటిన మూడు కోట్ల మొక్కలు నాటాలి అనేది నా సంకల్పం. మీరు సమాజానికి గొప్ప ఆదర్శప్రాయులు, వనజీవి రామయ్య జీవితం ఆయన మొక్కల పైన మక్కువ, చెట్లు ఎలా పెంచుతున్నారు అనే విషయాన్ని నేటి తరం ప్రజాప్రతినిధులు అందరూ తెలుసుకోవాలని మంత్రి హరిష్‌రావు అన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ రామయ్య ‘నమస్తేతెలంగాణ’తో ఫోన్‌లో మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు అతిథ్యం జీవితంలో మరువలేనిది. తను మంత్రి అనే ఫీలింగ్‌ లేకుండానే నాకు, నా భర్యకు ఆయనే స్వయంగా వడ్డించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.  logo