ఇచ్చోడ, ఏప్రిల్ 19 : పాత కల్వర్టుల స్థానంలో కొత్తవి నిర్మించిన తర్వాతే రోడ్డు నిర్మాణం చేపట్టాలని ముక్రా (బీ) సర్పంచ్ అడవ్ మారుతి తెలిపారు. బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన సోమవారం అడ్డుకున్నారు. మండలంలోని రఘుగూడ సమీపంలోని నాలుగు వరుసల జాతీయ రహదారి నుంచి ముక్రా (బీ), ముక్రా (కే), జల్దా గ్రామాల పీఎంజీఎస్‌వై పథకం కింద రూ.3.70 కోట్లతో తారు రోడ్డు నిర్మిస్తున్నారు. ముక్రా (బీ) గ్రామంలో పాత కల్వర్టుల స్థానంలో కొత్తవి నిర్మించకుండానే పనులు చేపడుతుండడంతో అడ్డుకున్నామని సర్పంచ్ తెలిపారు. దీనిపై పంచాయతీరాజ్ శాఖ ఏఈ రాజేశ్‌ను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. గైడ్లెన్స్ ప్రకారం బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నామని చెప్పారు. రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకునే హక్కు సర్పంచ్‌కు లేదన్నారు. ఈ విషయమై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ దృష్టికి తీసుకెళ్లగా.. గ్రామంలో పాత కల్వర్టుల స్థానంలో కొత్తవి నిర్మించుకునేందుకు నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని ఏఈ తెలిపారు.