సోమవారం 03 ఆగస్టు 2020
Khammam - Jul 13, 2020 , 05:07:09

402 అడుగులకు చేరిన కిన్నెరసాని..

402 అడుగులకు చేరిన కిన్నెరసాని..

పాల్వంచ రూరల్‌: మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రం 402 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు. ఇటీవల కిన్నెరసాని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగటంతో ఆ వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ సీజన్‌లో నీటిమట్టం 402 అడుగులు చేరడం ఇదే తొలిసారి. వరద ప్రవాహం కొనసాగితే నీటి మట్టాన్ని 405 అడుగులకు స్థిరీకరించి అధికంగా వచ్చే నీటిని దిగువకు విడుదల చేస్తామని డ్యామ్‌సైట్‌ అధికారులు తెలిపారు. 


logo