మంగళవారం 11 ఆగస్టు 2020
Khammam - Jul 13, 2020 , 04:23:37

హరిత సంకల్పం

హరిత సంకల్పం

  • భావితరాల ప్రయోజనాల కోసమే హరితహారం
  • పతి పోలీస్‌స్టేషన్‌ హరిత వనంగా మారాలి
  • రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం : ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు విరిగిగా మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సిటీ ఆర్మ్‌డ్‌ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి అనంతరం మాట్లాడారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో పది శాతం హరితహారానికి కేటీయించిందన్నారు. దీని ద్వారా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించామన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా ప్రజలను  చైతన్యం చేయాలన్నారు. చిన్నారుల్లో మొదటి నుంచే మొక్కలు నాటాలనే జిజ్ఞాసను కలిగించాలని సూచించారు. ఖమ్మం జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్‌ ఆవరణల్లో విరివిగా మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు.

అనంతరం ప్రకాశ్‌నగర్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న కమిషనర్‌ కార్యాలయం పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు. త్వరతిగతిన పూర్తి చేయాలని  సూచించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, నగర మేయర్‌ డాక్టర్‌ జీ పాపాలాల్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, నగర పాలకసంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రవీణ, అడిషనల్‌ డీసీపీలు కుంజారపు పూజ, మురళీధర్‌, మాధవరావు, ఏసీపీలు రామోజీ రమేష్‌, వెంకటరెడ్డి, వెంకట్రావు, విజయబాబు, సీఐలు చిట్టిబాబు, శ్రీధర్‌, ఆర్‌ఐలు శ్రీనివాస్‌, రవి, సాంబశివరావు, కార్పొరేటర్లు మందడపు మనోహర్‌రావు, కమర్తపు మురళీ, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆర్‌జేసీ కృష్ణ పాల్గొన్నారు.MOST READ
logo