మంగళవారం 11 ఆగస్టు 2020
Khammam - Jul 12, 2020 , 08:11:26

అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి

అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి

  • ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌ 

ఇల్లెందు: మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరిగా ఉండాలని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌ అధికారులకు సూచించారు. ఆంబజార్‌ రోడ్డు, బుగ్గవాగు ప్రక్షాళన పనులను శనివారం ఆమె పరిశీలించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఇల్లెందు మున్సిపాలిటీకి వచ్చిన మంత్రి కేటీఆర్‌ ఇల్లెందును అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు హామీ ఇచ్చారన్నారు. రాబోయే రోజుల్లో ఇల్లెందు పట్టణాన్ని సుందరీకరించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు హరిసింగ్‌నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎస్‌డీ జానీ, నాయకులు పులిగళ్ల మాధవరావు, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ ఉమాదేవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

ప్రతి ఇంట్లో పచ్చందాలు

ఇల్లెందు రూరల్‌ : ప్రతి ఇల్ల్లూ పచ్చందాలతో పరిఢవల్లేలా విరివిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌ పిలుపునిచ్చారు. మండలంలోని చల్లసముద్రం గ్రామపంచాయతీ వేములవాడ గ్రామ డబుల్‌ బెడ్‌రూం నిర్మాణ ప్రాంగణంలో శనివారం మొక్కలు నాటి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత సాధించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ హరితహారం అమలులోకి తెచ్చారని గుర్తుచేశారు. ప్రతి కుటుంబం ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటుకొని సంరక్షించాలని సూచించారు. సర్పంచ్‌లు టీ చుక్కమ్మ, అలెం కౌస ల్య, ఎం సునీత, చాట్ల భాగ్యమ్మ, ఎన్‌ తిరుపతి, ఎంపీటీసీలు పీ లింగమ్మ, ఎం జయమ్మ, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ బీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ మస్తాన్‌రావు, ఎంపీడీవో శ్రీనివాస్‌, సీఐ వేణుచందర్‌, ఏపీఎం దుర్గారావు, ఆర్‌ఐ సూర్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి వంశీ, హర్షిణి, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కే రేణుక, ప్రధాన కార్యదర్శి వై రవి, నాయకులు బీ వెంకన్న, బీ వెంకన్న, ఎల్‌ నాగరాజు, ఏ నారాయణ, బీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.


logo