బుధవారం 05 ఆగస్టు 2020
Khammam - Jul 11, 2020 , 04:10:19

తల్లాడ సహకార సొసైటీ సీఈవోపై సస్పెన్షన్‌ వేటు

తల్లాడ సహకార సొసైటీ సీఈవోపై సస్పెన్షన్‌ వేటు

ఖమ్మం వ్యవసాయం: రూపే కిసాన్‌ కార్డుల పంపిణీ వ్యవహారంలో తల్లాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కె.వీరారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. జిల్లా సహకార అధికారి(డీసీవో) విజయకుమారి శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సొసైటీ పరిధిలోని రైతులకు రెండేళ్ల క్రితం డీసీసీబీ పంపిన రూపే కార్డులను సొసైటీ బాధ్యులు అందజేశారు. ఇవి రైతులకు కాకుండా ఇతరులకు అందాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ సొసైటీ పరిధిలోని 432 మంది రైతులకు చెందిన కార్డులు ఇతరుల చేతుల్లోకి వెళ్లినట్లు జిల్లా అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, సొసైటీ సీఈవోపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ వ్యవహారంలో సొసైటీ నిర్వాహకుల పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు డీసీవో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని సొసైటీల ద్వారా జరిగిన రూపే కార్డుల పంపిణీపై కూడా సమగ్రంగా విచారణ జరపనున్నట్లు తెలిపారు.


logo