బుధవారం 12 ఆగస్టు 2020
Khammam - Jul 11, 2020 , 03:24:49

సీతారామ పనులపై ఏరియల్‌ సర్వే

 సీతారామ పనులపై ఏరియల్‌ సర్వే

  • ప్యాకేజీల పనుల జాప్యాన్ని నియంత్రించేందుకు మంత్రి పువ్వాడ కార్యాచరణ 

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.  శుక్రవారం పథకం నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. హెలికాప్టర్‌ నుంచి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. పంప్‌హౌజ్‌-1, 2కు సంబంధించిన పనుల జాప్యాన్ని నియంత్రించేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు.

ప్రాజెక్టు పనుల్లోని 1 నుంచి 8వరకు ప్యాకేజీ పనులను తక్షణమే పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. 9నుంచి 12ప్యాకేజీల పనులకు టెండర్లు పూర్తయ్యాయి. అనంతరం 14నుంచి 16వరకు ప్యాకేజీల టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అజయ్‌ కుమార్‌ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు కూడా సాగునీరు అందే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. 


logo