శుక్రవారం 07 ఆగస్టు 2020
Khammam - Jul 07, 2020 , 03:11:37

కలెక్టరేట్‌లో ‘ఆన్‌లైన్‌ ’ గ్రీవెన్స్‌

కలెక్టరేట్‌లో ‘ఆన్‌లైన్‌ ’ గ్రీవెన్స్‌

  • తొలిసారి నూతన విధానానికి శ్రీకారం చుట్టిన కలెక్

    ఖమ్మం : కలెక్టరేట్‌కు సమస్యలపై అర్జీలు అందించేందుకు వచ్చే ప్రజల సౌకర్యార్థం కరోనా వైరస్‌ కట్టడిలో భాగం గా ఆన్‌లైన్‌ వీడియో గ్రీవెన్స్‌కు సోమవారం నుంచి కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ శ్రీకారం చు ట్టారు. లాక్‌డౌన్‌ వల్ల గ్రీవెన్స్‌డే తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా గూగుల్‌ మీట్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ వీడియో గ్రీవెన్స్‌ను కలెక్టరేట్‌లో ప్రారంభించారు. దీనిద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులు సత్వర చర్య తీసుకునేలా కలెక్టర్‌ ఏఓను ఆదేశించారు. ఆన్‌లైన్‌ వీడియో గ్రీవెన్స్‌లో కలెక్టరేట్‌ పరిపాలన అధికారి మదన్‌గోపాల్‌ పాల్గొన్నారు.


logo