శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Khammam - Jul 06, 2020 , 04:25:06

జిల్లావ్యాప్తంగా భక్తి ప్రపత్తులతో గురుపౌర్ణమి

జిల్లావ్యాప్తంగా భక్తి ప్రపత్తులతో గురుపౌర్ణమి

  • సాయినామ స్మరణతో మార్మోగిన మందిరాలు 

ఖమ్మం కల్చరల్‌: ‘ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి’ అనే సాయి నామస్మరణతో భక్తులు పులకించిపోయారు. ఆషాఢ పూర్ణిమ ఆదివారం వ్యాస భగవానుడి జన్మదినాన్ని గురుపౌర్ణమి పర్వంగా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. పంచమవేదం మహాభారతాన్ని రచించడమే కాకుండా లోకానికి వేద పురాణాన్ని అందించిన వ్యాస మహర్షి స్మరణలో భక్తులు తరించారు. విష్ణు అవతారమైన వ్యాసుడిని పూజించమని షిర్డీ సాయినాథుడు తన భక్తులకు పరోక్షంగా ఉపదేశించడంతో ఈ రోజున వ్యాస భగవానుడిని పూజించడంతోపాటు భక్తులు సాయినాథుడిని కూడా పూజించే ఆచారాన్ని కొనసాగించారు.

ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా గల షిర్డీ సాయిబాబా మందిరాల్లో ‘సబ్‌కా మాలిక్‌ ఏక్‌ హై’ అనే స్మరణలు మార్మోగాయి. కరోనా నిబంధనలను అనుసరిస్తూ, మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ మందిరాల్లో తమ ఇష్ట దైవాలను దర్శించుకుని పూజలు చేశారు. నగరంలోని గాంధీచౌక్‌ శ్రీవరప్రదాత షిర్డీ సాయి మందిరంలో కమిటీ అధ్యక్షుడు వేములపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. మామిళ్లగూడెం సాయిబాబా మందిరం, స్తంభాద్రి గుట్టపై గల కాలసాయి మందిరం, గుట్టలబజార్‌లోని కృష్ణసాయి ఆశ్రమం, పెద్దతండా యోగానంద సాయి ఆశ్రమం, విజయనగర్‌ కాలనీలోని సాయి మందిరాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.  


logo