శుక్రవారం 07 ఆగస్టు 2020
Khammam - Jul 04, 2020 , 02:46:18

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • కమిషనర్ అనురాగ్ జయంతి

ఖమ్మం : నగరంలో అన్ని డివిజన్లలో ఫ్రైడే  డ్రైడే కార్యక్రమం తప్పకుండా పాటించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. శుక్రవారం నగరంలోని పలు డివిజన్‌ల్లో ఆయన పర్యటించి డ్రైడే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌పీలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు చేస్తున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. బావులు, మురుగు కాలువల్లో లార్వాను నియంత్రించేందుకు ఆయిల్ బాల్స్‌ను వేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

గ్రామాల్లో ఫ్రైడే-డ్రైడే

రఘునాథపాలెం : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని గ్రామాల్లో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ తిరిగి ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చేశారు. ప్రధాన వీధుల్లో వర్షపు నీటి నిల్వ ఉన్న చోట్ల బ్లీచింగ్ పిచికారీ చేశారు. డ్రైనేజీల్లో ఆయిల్‌బాల్స్ చల్లారు. మండల కేంద్రం రఘునాథపాలెంలో జరిగిన కార్యక్రమాన్ని ఎంపీడీవో అశోక్ కుమార్ పర్యవేక్షించారు. సర్పంచ్ గుడిపుడి శారద, ఏవో ఇంటూరి భాస్కర్‌రావు, ఉపసర్పంచ్ కుందేసాహెబ్, కార్యదర్శి ప్రసన్నకుమార్, గ్రామ పెద్ద గుడిపుడి రామారావు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. రేగులచలకలో సర్పంచ్ కొర్లపాటి రామరావు, కార్యదర్శి సంగీత గ్రామంలో పర్యటించి పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చిమ్మపూడిలో సర్పంచ్ గొర్రె కృష్ణవేని, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్‌ల పర్యవేక్షణలో, పువ్వాడ ఉదయ్‌నగర్‌లో సర్పంచ్ కాంపాటి లలిత ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరిగింది.  logo