శుక్రవారం 07 ఆగస్టు 2020
Khammam - Jul 04, 2020 , 02:46:18

ఆలోచన అదుర్స్..

ఆలోచన అదుర్స్..

  • n ఎడ్లు లేకపోవడంతో బైక్‌కు నాగలి బిగించి పత్తిపాదులు
  • n వినూత్న రీతిలో సాగు చేస్తున్న వేపకుంట్ల  యువ రైతు 

రఘునాథపాలెం: సాగులో వినూత్న పద్ధతులకు శ్రీకారం చుడుతున్నారు యువ రైతులు. పాత తరం విధానాలను పక్కన పెట్టి అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వాడే ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం వేపకుంట్ల గ్రామానికి చెందిన యువరైతు శీలం నాగరాజు. 2011లోనే డిగ్రీ పూర్తి చేసిన నాగరాజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఉన్నత చదువుకు పుల్‌స్టాప్ పెట్టాడు. అప్పటి నుంచి వ్యవసాయమే చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. అయితే ప్రతి ఏటా దుక్కులు దున్నుడం, పాదులు చేయడానికి అవసరమైన ఎడ్లు లేకపోవడం నాగరాజుకు పెద్ద సమస్యగా  పరిణమించింది. ఇందుకు ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమైనా ఉన్నాయా అని.. యూటూబ్‌ను ఆశ్రయించాడు నాగరాజు. వెతుకులాటలో యూటూబ్ తల్లీ బైక్ నాగలి పరిష్కారం చూపింది. ఇంకేముంది ప్రయోగాన్ని పక్కాగా అమలు చేసేందుకు తన స్వంత వాహనాన్ని ఉపయోగించాడు. రూ.2వందలు ఖర్చు ఆరు ఇనుప రాడ్లను తీసుకువచ్చాడు. బైక్ సీటును తొలగించి వెనుకాల భాగంలో వెల్డింగ్ చేయించాడు.. తర్వాత నాగలిని బిగించాడు. శుక్రవారం బైక్ నాగలి సహాయంతో పత్తిలో పాదులు చేస్తుండగా నమస్తే క్లిక్ మనిపించింది. నాగరాజు పాదులు చేసేందుకు జాగ్రత్తగా అతని బావ వెనకాల నాగలి పట్టుకొని సాలీర్వాలు దున్నడం కనిపించింది. 


logo