మినియాపొలిస్: అమెరికాలోని మినియాపొలిస్‌లో పోలీసులు 20 ఏండ్ల నల్ల జాతి యువకుడిని కాల్చిచంపారు. నగర శివారులో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన డాంటే రైట్ అనే ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోఅతను తిరిగి తన కారులోకి ఎక్కడంతో ఓ పోలీసు కాల్పులు జరిపాడని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో వందలాది మంది నిరసనకు దిగారు. గతంలో డెరెక్ చౌవిన్ అనే శ్వేతజాతి పోలీసు అధికారి జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని మెడపై మోకాలితో నొక్కి చంపాడు. ఆ హత్యపై అమెరికావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.