గురువారం 02 జూలై 2020
Khammam - Jul 01, 2020 , 01:16:20

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కందాల

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కందాల

కూసుమంచి రూరల్‌ : రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చేగొమ్మ సొసైటీలో రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడుతూ  సబ్సిడీపై అందిస్తున్న ఎరువులు, విత్తనాలను చేగొమ్మ సొసైటీ పరిధిలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సొసైటీ చైర్మన్‌, డీసీసీబీ డైరక్టర్‌ ఇంటూరి శేఖర్‌రావు మాట్లాడుతూ  రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో ఏడీఏ విజయచంద్ర, ఏవో వాణి, సొసైటీ వైస్‌ చైర్మన్‌ బీ. శ్రీను, డైరెక్టర్లు మల్లీడు వెంకటేశ్వర్లు, గురుస్వామి, నర్సింహారావు, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చాట్ల పరుశురాం, ఎంపీటీసీలు ఉడుగు జ్యోతి, అంబాల ఉమ, సర్పంచ్‌లు రెడ్డిమళ్ల రమణమ్మ, కొండా సత్యం తదితరులు పాల్గొన్నారు.

నాటిన మొక్కలను సంరక్షించాలి.. 

తిరుమలాయపాలెం : ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించి హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని సోలిపురంలో మంగళవారం సాయంత్రం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు.   కార్యక్రమంలో ఎంపీపీ బోడ మంగీలాల్‌, బెల్లం శ్రీను, సర్పంచ్‌ హళావత్‌ జ్యోతి,  సొసైటీ  వైస్‌ చైర్మన్‌ చావా వేణు, చామకూరి రాజు, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, వంచర్ల సత్యనారాయణరెడ్డి, చావా శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సోలిపురంలో సంకినేని నర్సింహారావు, బీరోలులో కొప్పుల శ్రీనివాసరెడ్డి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు.  


logo