గురువారం 16 జూలై 2020
Khammam - Jul 01, 2020 , 01:06:58

కాలువల్లో పూడిక తీయడం వల్ల రైతులకు మేలు

కాలువల్లో పూడిక తీయడం వల్ల రైతులకు మేలు

  • ప్రభుత్వం చెప్పిన పంటలు వేసి లాభాలు పొందాలి: ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి: ఇక ఆయకట్టు చివరి వరకూ పుష్కలంగా సాగునీరు అందుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. పంటల కాలువల్లో పూడిక తీయడం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. వర్షాకాలం సీజన్‌లో మండలంలోని నారాయణపురంలో ప్రారంభమైన వరినాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ముందుగా బేతుపల్లి చెరువు పరిధిలో పూడిక తీసిన కాలువలను సందర్శించారు. దాని కింద నాట్లు వేస్తున్న రైతులు, కూలీలతో కాసేపు ముచ్చటించారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిస్తే అన్ని పంట కాలువలూ పూర్తిస్థాయిలో పారి ఆయకట్టు చివరి భూముల వరకూ పుఫ్కలంగా సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. రైతులు కూడా ప్రభుత్వం సూచించిన పంటలు వేసి అధిక లాభాలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామానికి చెందిన శీలపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల గుండె సంబంధిత పరీక్షలు చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన్ను ఎమ్మెల్యే పరామర్శించారు. ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, తుమ్మూరు కృష్ణారెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, భీమిరెడ్డి కేశవరెడ్డి, పాకలపాటి శ్రీనివాసరావు, వంకాయలపాటి నర్సింహారావు, గోగులమూడి బాలాజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo